ఇవాళ మహాశివరాత్రి. ఈ నేపథ్యంలో శివుడికి ప్రత్యేకం గా పూజలు చేసి.. చాలామంది జాగారాలు ఉంటారు. అయితే.. ఈ మహా శివుడి కథ ఆధారంగా తాలూడి ఇండస్ట్రీలో అనేక సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు సక్సెస్ కూడా అయ్యాయి. సినిమా మొత్తం శివుడి కథ నేపథ్యంలో లేకున్నా ఏదో ఒక సీను లేదా సాంగ్స్ గాని... శివయ్య నామస్మరణంతో చేశారు. లేదా శివుడి గెటప్ లో హీరోలు కనిపించడం మనం చూశాం. అయితే అలా జగపతిబాబు నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో కూడా... శివయ్య రూపం మనకు కనిపిస్తుంది.

 టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబుకు ఉన్న క్రేజ్ ఎంత కాదు. అయితే జగపతిబాబు అలాగే  హీరోయిన్ ప్రియమణి కాంబినేషన్లో పెళ్లయిన కొత్తలో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది.

 ముఖ్యంగా ఇందులో టాలీవుడ్ నటి ఝాన్సీ చేసే కామెడీ.. అందరినీ నవ్విస్తుంది. అయితే జగపతిబాబు అలాగే ప్రియమణి కాంబినేషన్లో వచ్చిన ఈ పెళ్లయిన కొత్తలో సినిమా 2006 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు నిర్మాతగా మదన్  ఏ వ్యవహరించారు. 2006 ఆ సమయంలో కొత్తగా పెళ్లయిన యువ జంటలకు ఎలాంటి సమస్యలు వస్తాయి... కాపురాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ కాపురాన్ని ఎలా చూసుకుంటున్నారు...? అనే అంశాల నేపథ్యంలో ఈ పెళ్లయిన కొత్తలో సినిమా తీశారు.

 ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా చేస్తే ఆయన భార్యగా ఈ సినిమాలో ప్రియమణి కనిపించారు. ఇద్దరి మధ్య కూడా కొన్ని సీన్స్ చాలా పడ్డాయి. రొమాంటిక్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే జగపతిబాబు నటించిన ఈ సినిమాలో.. శివుడి పాత్రలో జగపతిబాబు కాసేపు కనిపిస్తారు. ఈ సినిమాలో మనసు కన్ను చేసుకొని చూడరా లోకం  అనే పాట ఉంది. ఈ సాంగ్లో జగపతిబాబు... శివయ్య రూపంలో కనిపిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: