కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోగా, విలన్ గా పలు చిత్రాలలో నటించి బాగానే పీరసంపాదించారు. ముఖ్యంగా వైశాలి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి సరైనోడు సినిమాలో విలన్ గా అద్భుతమైన క్యారెక్టర్ లో నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలుగా నటించి పేరు సంపాదించిన ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది. 2022లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇంకా మొదటి సంతానానికి ఆహ్వానం పలకలేదు ఈ జంట.


దీంతో గత కొద్ది రోజులుగా వీరి మధ్య విడాకుల వ్యవహారం నడుస్తోందనే విధంగా వార్తలు వినిపించాయి. తాజాగా శబ్దం సినిమాలో ఆది పినిశెట్టి నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన విడాకుల వార్తల పైన మాట్లాడడం జరిగింది.. వాస్తవానికి నిజం చెప్పాలి అంటే సున్నితంగా ఉండకూడదు అనుకుంటున్నాను.. ధైర్యంగా ఉండాలని డిసైడ్ అయ్యానని తెలిపారు.. కొంతమంది మర్యాద ఇవ్వకపోయినా కొంతమంది కేర్ చేయకపోయినా కూడా మీ వెనుక మాట్లాడుతూ ఉన్నప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండాలని తెలిపారు.


గతంలో తాను కూడా ఈ విడాకుల వ్యవహారం పైన థంబ్నెయిల్ చూసి చాలా సార్లు షాక్ అయ్యానని తెలిపారు. అయితే అలాంటి వీడియోలు పెట్టిన వారు ఎలాంటి వారో చూడాలనుకున్నానని.. అయితే అవన్నీ చూశాక అతడి గురించి చూశాక మా విడాకుల వార్తలు క్రియేట్ చేసిన విషయం అసలు పట్టించుకోలేకపోయానని తెలిపారు. ఏమీ లేకుండానే రెండు ఫోటోలు పెట్టి చెప్పేస్తే అయిపోతుందా ఇలాంటి వాళ్ల గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని.. ఇలాంటి విషయాలు ఎంత వదిలేస్తే అంత మంచిదని వెల్లడించారు.తన విడాకుల వార్తలు విన్నప్పుడు, చూసినప్పుడు కొంత బాధ అనిపించిన ఆ తర్వాత వదిలేస్తానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: