సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ ఇలా ఎవరైనా పర్వాలేదు ఇండస్ట్రీలో స్టార్లుగా రాణించాలంటే చాలు వారి వారసులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు. ఒకవేళ వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో స్టార్స్ ని చేస్తారు. లేకపోతే బిజినెస్లలో పార్ట్నర్లను చేస్తారు.అయితే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు వారి వారసులను కూడా సినిమాల్లోకి తీసుకువచ్చారు. అలా ఓ నిర్మాత కూడా తన కొడుకుని ఇండస్ట్రీ లోకి తీసుకురావాలని భారీ ప్లాన్ వేశారు. తన కొడుకు మొదటి సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడమే కాదు తన కొడుకుతో నటించే హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్నారు. అలా ఆ హీరోయిన్ మొదట కొత్త హీరోతో నేను నటించను నా ఇమేజ్ పోతుంది అని చెప్పిందట.కానీ వినకుండా ఆ స్టార్ నిర్మాత హీరోయిన్ తన కొడుకు సరసన నటీంచడం కోసం భారీ ఆఫర్ ఇచ్చారట.

 ఇక ఇప్పటికే ఆ నిర్మాత ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి బెల్లంకొండ సురేష్ బాబు హీరోయిన్ సమంత.. బెల్లంకొండ సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను అనే మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించింది.అయితే ఈ సినిమా వచ్చిన సమయంలో చాలామంది సమంత ఫ్యాన్స్ అంత పెద్ద హీరోయిన్ ఈ కొత్త హీరో పక్కన నటించడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటీంచడానికి సమంత రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందట. అందుకే ఈ సినిమాలో కొత్త హీరోతో రొమాన్స్ చేసిందట.అయితే ఈ సినిమాలో నటించడానికి ముందుగా సమంత ఒప్పుకోలేదట.

కానీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు ఫోర్స్ చేయడంతో ఆమె ఒప్పుకుందట. అయితే ఆ టైంలోనే సమంతకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాదాపు 25 లక్షల రూపాయలు నిర్మాత సమంతకు ఇచ్చారట. ఆ తర్వాత రెమ్యూనరేషన్ లో ఆ 25 లక్షలు కట్ చేశారట.అలాగే అల్లుడు శీను మూవీ హిట్ కొట్టడంతో ఈ సినిమాలో వచ్చిన లాభాలతో సంతోషంగా ఫీలైన నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ దాదాపు 1250 గజాలతో ఉన్న తన ఫామ్ హౌస్ ని సమంతకి బహుమతిగా ఇచ్చారట. అయితే అప్పట్లోనే ఫామ్ హౌస్ లో విలువ కోటి యాభై లక్షలని ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ మార్కెట్ వ్యాల్యూ ఎక్కువగానే ఉందని, ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఒక గజం వ్యాల్యూ దాదాపు రెండు లక్షలకు పైగానే ఉంది అని నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: