చాలా సంవత్సరాల క్రితం భక్తి సినిమాలు మన తెలుగు భాషలో అనేకం వచ్చేవి. కానీ ప్రస్తుతం ఈ సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇక చాలా సంవత్సరాల క్రితం స్టార్ హీరోలు ఎక్కువ శాతం భక్తి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. దానితో ఆ సినిమాలు ప్రేక్షకులకి పెద్ద ఎత్తున రీచ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎక్కువ శాతం భక్తి సినిమాలు చేయడం లేదు. చిన్న హీరోలు భక్తి సినిమాల్లో నటించిన వాటికి పెద్దగా రీచ్ ఉండడం లేదు.ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది గొప్ప గొప్ప నటులు కలిసి జగద్గురు ఆది శంకర అనే శివ భక్తి సినిమాలో నటించారు. 2013 వ సంవత్సరం విడుదల అయిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మూవీ లో కౌశిక్ బాబు , అక్కినేని నాగార్జున , మోహన్ బాబు , సాయి కుమార్ , శ్రీహరి , సుమన్ ముఖ్య పాత్రలలో నటించగా ... ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించాడు. జె. కె. భారవి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నాగ శ్రీవత్స ఈ మూవీ కి సంగీతం అందించాడు. నాగ శ్రీవత్స ఈ మూవీ కి అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాలో మంచి గుర్తింపు కలిగిన ఎంతో మంది నటీ నటులు నటించడంతో ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. శివ భక్తితో వచ్చిన సినిమాల్లో ఈ మూవీ మంచి స్థానాన్ని కూడా దక్కించుకుంది.  జె. కె. భారవిమూవీ ని అద్భుతంగా తెరకెక్కించింది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను జె. కె. భారవి కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన శివ భక్తి సినిమాల్లో మంచి స్థానాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: