
కథ :
కృష్ణ (సందీప్ కిషన్), వెంకట రమణ (రావు రమేష్) తండ్రీ కొడుకులు కాగా తండ్రి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తుండగా కొడుకు బీటెక్ చదివి సరైన జాబ్ కోసం వెతుకుతుంటాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల కొడుకుకు పెళ్లి జరగకపోవడంతో మొదట తను పెళ్లి చేసుకుని కొడుకుకు పెళ్లి చేయాలని వెంకట రమణ ఫిక్స్ అవుతాడు.
అయితే తండ్రీకొడుకులిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు యశోద(అన్షు), మీరా (రీతూవర్మ)లతో ప్రేమలో పడతారు. అయితే తండ్రీ కొడుకులు ఆశ పడినట్టు పెళ్లి జరిగిందా? బిజినెస్ మేన్ భార్గవ్ (మురళీ శర్మ) ఈ తండ్రీ కొడుకులతో పగేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
త్రినాథరావు నక్కిన సక్సెస్ రేట్ ఎక్కువే అయినా మజాకా విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ తమ పాత్రలకు న్యాయం చేసినా కథనంలో లోపాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. స్టోరీ లైన్ బాగానే ఉన్నా లాజిక్ పట్టించుకోకుండా తీసిన సీన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. సందీప్ కిషన్ కు ఈ సినిమాతో మరీ భారీ హిట్ అయితే దక్కలేదనే చెప్పాలి.
ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉన్నా ఇంకా బెటర్ గా సినిమాను తెరకెక్కించొచ్చనే భావన మాత్రం కలుగుతుందని చెప్పవచ్చు. రావు రమేష్ ఈ సినిమాలో డ్యాన్స్, యాక్షన్ సీన్స్ తో సైతం ఆకట్టుకున్నారు. మజాకా సినిమా టెక్నికల్ గా బాగానే ఉంది. ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సందీప్ కిషన్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్లు : సెకండాఫ్, కామెడీ సీన్స్, రావు రమేష్ యాక్టింగ్
మైనస్ పాయింట్లు : ఫస్టాఫ్, స్రీన్ ప్లే, డైరెక్షన్
రేటింగ్ : 2.5/5.0