సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ ఇండియాకు రాబోతున్నాడా .. టైటానిక్ ,  ట్రూ లైస్ లాంటి సినిమాలు తో భారీ ట్రెండ్ క్రియేట్ చేసిన జేమ్స్ కామేరున్ అంటేనే .. అవతార్ సినిమా గుర్తొస్తుంది .. కొన్ని సంవత్సరాలుగా అవుతార్‌ సీక్వెల్స్ తెర‌క్కిస్తున్న ఈ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా కోసం రంగాల్లోకి దిగబోతున్నాడట .. ఇప్పటికే ఇండియాకి బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది .. ఏకంగా ఓ దేశంలోని ప్రాంతీయ భాష సినిమాని .. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు .. ప్రపంచ దిగ్గజ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జేమ్స్ కామేరున్ ఎందుకు రాజమౌళికి ఎంత పెద్ద సాయం చేస్తున్నాడు ? ఓ తెలుగు సినిమా కోసం హాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ఎందుకు ఇంత దూరం వస్తున్నాడు ? ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అధినేత రాజమౌళి సినిమా కోసం ఓ అడుగు ముందుకేసారని ప్రచారం కూడా జరుగుతుంది .. ఇలాంటి సమయంలో అవతార్ లాంటి దిగ్గజా సినిమా దర్శకుడు రాజమౌళి సినిమా కోసం వస్తున్నారంటే ఇది నిజమేనా ? ఏప్రిల్  లో ప్రెస్ మీట్ని సడన్గా ఫిక్స్ చేయడానికి ఆయనే కారణమా? అసలు మహేష్ సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్ ఏంటి?
 

జేమ్స్ కామేరున్ అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ టైటానిక్ సినిమా దర్శకుడు అంటే అందరికీ అర్థమవుతుంది .. అవతార్ దర్శకులు అన్న వెంటనే అందరూ కనెక్ట్ అయిపోతారు .. మన ఇండియన్ ఇండస్ట్రీలో టాలీవుడ్ కి రాజమౌళి, సుకుమార్, కోలీవుడ్ కి శంకర , మణిరత్నం ఎలాగో హాలీవుడ్ కి స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామెరున్ రెండు కళ్ళు లాంటివారు .. హాలీవుడ్ సినిమాలతో మన సినిమాలుని పోల్చలేం .  కానీ అక్కడ కూడా ఇద్దరు దర్శకులు ఎంత లెజెండ్స్ తెలియాలంటే ఈ పోలిక తప్పదు .. అలాంటి హాలీవుడ్ దిగ్గజ లెజెండ్స్ అయినా జేమ్స్ కామెరున్ ఇండియాకు వస్తున్నారు .. గతంలో కూడా వచ్చారు కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా కోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారు .. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ల్యాండ్ కాబోతున్నారు .. ఏప్రిల్ మొదటి వారంలో మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా సెట్ లో ఆయన సందడి చేయబోతున్నారు.

 

అసలు మేటర్ ఏమిటంటే .. మహేష్ తో చేసే పాన్ వరల్డ్ సినిమాకి హాలీవుడ్ ప్రమోటర్గా జేమ్స్ కామెరున్ ని ఎంచుకున్నారని తెలుస్తుంది .. ఇప్పటికే ఇది ఆల్మోస్ట్ ఆన్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన విషయమే .. కాకపోతే ఏప్రిల్ లో ఓ ప్రెస్ మీట్ లో ఆయన రాజమౌళితో కనిపించి ఏదైనా చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఆస‌లు మేటర్ బయటకు వస్తుంది .. ఇప్పటికే త్రిబుల్ ఆర్ చూసినప్పుడు రాజమౌళిని తెగ ఆకాశానికి ఎత్తేసారు ఈ దర్శకుడు .. అలాగే ఆస్కార్ అవార్డ్స్ టైంలో రాజమాలితో చాలాసేపు మాట్లాడాడు .. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. సో ఇప్పుడు ఆ పరిచయం వల్ల రాజమౌళి కొత్త సినిమాకు హాలీవుడ్లో ఈ దర్శకుడు సూచనలు ఇస్తున్నారట ? లేదంటే ఈ సినిమాను హాలీవుడ్ ప్రొడక్షన్లో లేదా డిస్ట్రిబ్యూషన్లో సహాయం చేస్తున్నారా అన్నది కూడా తెలియదు .. కాకపోతే రాజమౌళిని హాలీవుడ్ వచ్చేయి మనం కలిసి సినిమా తీద్దామని కూడా ఒక వీడియోలో జేమ్స్ కామెరున్ అన్నారు .. ఈ లెక్కన ఈ సినిమాలో తాను కూడా ప్రొడ్యూసర్ గా కొంత భాగం అయ్యాడు అన్నది ఏప్రిల్ లో వచ్చే ప్రెస్ మీట్ లో బయటకు రానుంది .. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి సినిమాను లాంచ్ చేసినప్పుడు కూడా మీడియాను పిలవలేదు రాజమౌళి .. ఇక ఇప్పుడు పనిగట్టుకుని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటే ఏదో ఊహించ‌ని విషయం ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: