
ఇక ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు లవ్లీ సినిమా హీరోయిన్ శాన్వి శ్రీ వాస్తవ.. మొదట హీరో ఆది సాయికుమార్ కి జోడిగా నటించింది. తన క్యూట్ లుక్కుతో అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రాలలో నటించింది అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కన్నడ సినీ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసింది. అక్కడ అవకాశాలు బాగానే అందుకోవడంతో పాటు పలు చిత్రాలతో సక్సెస్ కూడా అందుకుంది.
అయితే గతంలో ఒక సినిమా ఈవెంట్లో ఈమె తెలుగులో అవకాశాలు రావడం లేదంటు ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నదట. తనకు ఎందుకు అవకాశాలు రాలేదో ఇప్పటికి అర్థం కాలేదని.. కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు కన్నడలోనే పలు చిత్రాలలో నటిస్తున్న శాన్వి శ్రీవాత్సవ నిరంతరం సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లోనైనా సరే ఏవైనా తెలుగు చిత్రాలలో అవకాశాలు లభిస్తాయి ఏమో చూడాలి మరి. ప్రస్తుతమైతే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది శాన్వి.