పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో నీది అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అనేక సార్లు ప్రారంభం అయ్యి ఆగిపోవడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశగా ఈ మూవీ బృందం వారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం పాటు ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ విషయంలో చాలా సైలెంట్ గా ఉన్న ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం మాత్రం పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా నుండి కొల్ల గొట్టి నాదిరో అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు.

ఇకపోతే ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని రెండవ సాంగ్ అయినటువంటి కొల్ల గొట్టి నాదిరో సాంగ్ కి 24 గంటల్లో మంచి వ్యూస్ దక్కాయి. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 11.52 మిలియన్ వ్యూస్ ... 164.9 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని రెండవ పాటకు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: