టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వాదులు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వచ్చిన ఒక ఏరియా మాత్రం డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలను మిగిల్చింది. ఆ ఏరియా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ సినిమాకు మొత్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటివ రకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది  ఈ 18 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 19.45 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 6.24 కోట్లు , ఉత్తరాంధ్రలో 6.67 కోట్లు ,  ఈస్ట్ లో 2.96 కోట్లు , వెస్ట్ లో 2.09 కోట్లు , గుంటూరు లో 2.34 కోట్లు , కృష్ణ లో 2.26 కోట్లు , నెల్లూరులో 1.39 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 18 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 43.40 కోట్ల షేర్ ...70.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.26 కోట్లు , ఓవర్ సీస్ లో 4.70 కోట్ల  కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 52.36 కోట్ల షేర్ ... 91.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 37 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ 38 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 14.36 కోట్ల లాభాలు వచ్చాయి. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్మల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కి ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ ఫార్ములా కంప్లీట్ కాలేదు. ఈ సినిమాకు ఓవర్సీస్ లో 6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ ప్రాంతంలో ఈ మూవీ కి కేవలం 4.70 కోట్ల మాత్రమే ఇప్పటి వరకు దక్కాయి. రాబోయే రోజుల్లో మరి ఈ సినిమా ఈ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc