
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలివుడ్ లోనే ఫుల్ ఫామ్ లో వరుస విజయాల తో దూసుకుపోతున్నాడు .. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్యను మించిన హీరోలు ప్రస్తుతం లేరు .. బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్ విజయాల ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ప్రజెంట్ అఖండ 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది .. ఈరోజు శివరాత్రి సందర్భంగా అఖండ 2 నుంచి ఓ భారీ అప్డేట్ కూడా రిలీజ్ చేయబోతుంది చిత్ర యూనిట్ .
అయితే బాలయ్య అఖండ 2 సినిమా తర్వాత మరో స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో భారీ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది . ఇప్పటికే వీరి కాంబినేషన్లో వీర సింహారెడ్డి వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది . అయితే ఇప్పుడు గోపీచంద్ , బాలయ్య తో రెండోసారి చేయబోయే సినిమాను కూడా ఎవరు ఊహించని రేంజ్ లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట .. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలో కూడా రిలీజ్ చేయగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది ..
అందుకే ఇప్పుడు అఖండ 2 నుంచి బాలయ్య చేసే అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారు .. అయితే ఇప్పుడు గోపీచంద్ - బాలయ్య చేసే సినిమా కూడా ఎవరు ఊహించని స్టోరీ తో ఉండబోతుందని అంటున్నారు .. బాలయ్య కూడా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట .. ఈ సినిమాని కూడా 2026 దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అంటున్నారు . ఇక మరి గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్య తో పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సంచనాలు అందుకుంటారో చూడాలి.