
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే నాని నటించిన ‘ హిట్-3 ’ సినిమా ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత నాని తన తర్వాత సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ‘ ది ప్యారడైజ్ ’ టైటిల్ తో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా కూడా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీలో నాని తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పటికే పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడే నాని ఓ మిస్టేక్ చేస్తున్నాడా ? అన్న సందేహాలు ఆయన అభిమాను లతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి.
ఈ సినిమా లకు ముందు నాని నటించిన ‘ సరిపోదా శనివారం ’ కూడా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని గతం లో డిపరెంట్ కథాంశాల తో వచ్చిన సినిమాలను తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. కానీ, నాని చేస్తున్న ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే ... ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కాస్త దూరం అవుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే నాని వరుసగా చేస్తోన్న సినిమా లు యాక్షన్ ఓరియంటెండ్ తోనే ఉంటున్నాయి. ఇలా వరుసగా ఈ తరహా సినిమా లు చేస్తే ఇక ఫ్యామిలీ ప్రేక్షకులు నాని సినిమా లు చూసేందుకు ఎందుకు వస్తారు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాని ఈ విషయంలో ఇక జాగ్రత్తలతో కథలు ఎంపిక చేసుకోవాలి.