సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకి కొన్ని కొన్ని ట్యాగ్స్ బాగా కలిసి వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఈ ట్యాగ్స్ ఫ్యాన్స్ హీరోలకి ఇస్తుంటే..  మరి కొన్నిసార్లు కొంతమంది స్టార్స్ అలాంటి ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే ట్యాగ్ ని బండ్ల గణేష్ ఇచ్చాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు .


కాగా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే అందరికీ మొదటగా గుర్తుచేది చిరంజీవి.  దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎటువంటి సహాయం లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన హీరో చిరంజీవి . ఈయన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతున్న మూమెంట్ లో మెగాస్టార్ గా మారిపోయాడు. స్వయాన జనాలే ఆయనకి ఈ ట్యాగ్  ఇవ్వడం  గమనార్హం. అయితే మెగాస్టార్ కన్నా ముందే ఈ మెగా అనే ట్యాగ్ మరొక హీరో ఖాతాలో పడాల్సింది.



ఆయన మరెవరో కాదు శోభన్ బాబు . కోట్లాదిమంది లేడీస్ ఫేవరెట్ హీరో . ఎస్ శోభన్ బాబుకి మెగాస్టార్ అనే ట్యాగ్ ఇవ్వాల్సింది. కానీ ఆయనకు ఆంధ్ర అందగాడు అంటూ ఒక ట్యాగ్ బాగా సెట్ అవుతుంది అంటూ జనాలు అలా ఇవ్వడం ..ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్ సినిమాలు అందుకుంటున్న చిరంజీవికి మెగాస్టార్ అంటూ ట్యాగ్ ఇవ్వడం జరిగింది . శోభన్ బాబుకి లెడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ంగా ట్యాగ్ కన్నా ఆంద్ర అందగాడు అనే ట్యాగ్ ఇచ్చారు. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి ఉంటే ఆంధ్రా అందగాడు అనే ట్యాగ్ కన్నా ముందే మెగా అనే ట్యాగ్ శోభన్ బాబు ఖాతాలో పడేది.  అప్పుడు మెగాస్టార్ కి వేరే ఏదో ఒకటి ఇచ్చుండే వాళ్ళు . అలా శోభన్ బాబు ఖాతాలో నుంచి చిరంజీవి ఖాతాలోకి మెగాస్టార్ అన్న ట్యాగ్ వచ్చి చేరింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: