
ఇంతకీ ఆ మెగా హీరో మరెవరో కాదు .. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ .. ఈ సినిమాలో విలన్ గా సంజయ్‌దత్‌ని తీసుకోబోతున్నారని తెలుస్తుంది .. రీసెంట్ గానే ఈ సినిమా యూనిట్ ఆయన్ని కలిసిందట .. డైరెక్టర్ కూడా కథ చెప్పాడట నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ ఆఫర్ కూడా ఈ బాలీవుడ్ స్టార్ కు నచ్చడంతో .. సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి ..
ఇక ప్రస్తుతం హైదరాబాదులోని ఓ భారి ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారు .. రామ్ - లక్ష్మణ్ మాస్టర్లు ఈ ఫైట్ ను కంపోజ్ చేస్తున్నారు .. అలాగే సంజయ్ దత్ కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో అడుగుపెట్టే అవకాశం ఉంది .. రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది .. అలాగే దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెర్కకించబోతున్నట్లు తెలుస్తుంది .. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా బయటికి వదిలారు .. దానికోసం ఏకంగా 2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్ .. మరి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ పాన్ ఇండియా స్థాయిలో తానేంటో చూపించాలని కసితో ఉన్నాడు.