బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విక్కీ కౌశల్ తాజాగా చావా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన , విక్కీ కౌశల్ కి జోడిగా నటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన హిందీ భాషలో విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 11 రోజుల్లో రోజు వారిగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను , మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమాకు 33.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 39.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మూడవ రోజు ఈ సినిమాకి 49.03 కోట్ల కలెక్షన్లు దక్కగా , నాలుగవ రోజు 24.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 5 వ రోజు 25.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆరవ రోజు 32.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 7 వ రోజు ఈ సినిమాకు 21.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఎనిమిదవ రోజు 24.03 కోట్లు , 9 వ రోజు 44.10 కోట్లు , పదవ రోజు 41.10 కోట్లు 11 వ రోజు 19.10 కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమాకి 353.61 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ చాలా రోజుల పాటు అద్భుతమైన కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: