దివంగత హీరోయిన్ సౌందర్య మరణించి కూడా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉన్న చిరస్మరణీయురాలు. అలాంటి ఈ గొప్ప హీరోయిన్ ఎంతోమంది హీరోలతో జతకట్టింది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీలలో కూడా నటించింది. అయితే అలాంటి సౌందర్య తన తండ్రి ఆత్మ శాంతి కోసం ఓ పని చేసిందట. మరి ఇంతకీ సౌందర్య చేసిన ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య తండ్రి సత్యనారాయణ పలు సినిమాలకు నిర్మాతగా అలాగే రచయితగా కూడా వ్యవహరించారు. అలా చదువుకుంటున్న సౌందర్యను సినిమాల్లోకి తీసుకువచ్చి హీరోయిన్ ని చేశారు. ఇక సౌందర్య ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని ఆమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే తండ్రిని కోల్పోయింది.

ఇక తండ్రి మరణించిన దుఃఖంలో సౌందర్య ఒక సంచలన నిర్ణయం తీసుకుందట. అదేంటంటే తన తండ్రి ఆత్మకు నివాళిగా ఒక బ్యానర్ ను నిర్మించింది.అదే సత్య మూవీ మేకర్స్..ఇక ఈ బ్యానర్ పై తీవు అనే కన్నడ సినిమాని కూడా నిర్మించింది. ఈ సినిమాలో స్వయంగా సౌందర్యనే నటించింది. గిరీష్ కాసరవల్లి డైరెక్షన్లో వచ్చిన తీవు అనే సినిమాలో సౌందర్య నటిగా అలాగే ప్రొడ్యూసర్ గా కూడా చేసింది.

సినిమా 2002లో కన్నడ ఇండస్ట్రీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు జాతీయ అవార్డ్ లను కూడా అందుకుంది.అలా తన తండ్రి ఆత్మ శాంతి కోసం సత్య మూవీ మేకర్స్ అనే బ్యానర్ ని స్థాపించి కేవలం ఒకే ఒక్క సినిమాని నిర్మించింది.ఆ తర్వాత మళ్లీ ఈ బ్యానర్లో సినిమాలు రాలేదు. ఇక మహిళలను దృష్టిలో ఉంచుకొని తీసిన తీవు అనే మూవీలో సౌందర్య నటన అమోఘమని ఎంతోమంది మెచ్చుకున్నారు. అలా తన తండ్రి ఆత్మ శాంతి కోసం సౌందర్య చేసిన ఈ పనిని అప్పట్లో చాలా మంది మెచ్చుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: