
అయితే ఇప్పుడు ప్రభాస్ తో మరో ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నా .. గతంలో కూడా ఆ డైరెక్టర్ ప్రభాస్ సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చిన అవి నిజం కాలేదు . ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ వర్మతో .. ప్రభాస్ `బ్రహ్మరాక్షస్`అనే సినిమా చేయబోతున్నాడట .. ఇప్పటికే ప్రశాంత్ చెప్పిన కథ కు ప్రభాస్ ఓకే చెప్పినట్టు .. తెలుస్తుంది.. అలాగే ఈ సినిమా చేయడానికి ప్రభాస్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడని .. ఈ ప్రాజెక్టు కూడా ఓకే అయిందని ప్రభాస్ ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి .. త్వరలోనే ప్రభాస్ ఫై లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారట .. దానికి సంబంధించిన ఏర్పాటులు కూడా రెడీ అవుతున్నాయి .. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి .. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు .. ఈ సినిమాల మధ్య `బ్రహ్మరాక్షస్` కి ఎప్పుడు క్లాప్ కొడతారో ?