24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టైర్ 2 హీరోల సినిమా టీజర్లు ఏవో తెలుసుకుందాం.

హిట్ ది థర్డ్ కేస్ : నాని హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 17.12 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ టైర్ 2 హీరోలలో అత్యధిక వ్యూస్ ను 24 గంటల్లో సాధించిన టీజర్ల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది.

కింగ్డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ కు 24 గంటల్లో 11.88 మిలియన్ వ్యూస్ దక్కాయి. దాంతో ఈ సినిమా టీజర్ రెండవ స్థానంలో నిలిచింది.

అంటే సుందరానికి : నాని హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ కు 24 గంటల్లో 10.36 మిలియన్ న్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ టీజర్ మూడవ స్థానంలో నిలిచింది.

ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ కి 24 గంటల్లో 9.82 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ సినిమా టీజర్ నాలుగవ స్థానంలో నిలిచింది.

ఏజెంట్ : అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ 9.78 మిలియన్ వ్యూస్ తో ఐదవ స్థానంలో నిలిచింది.

స్పై : నిఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ 9.72 మిలియన్ వ్యూస్ తో ఆరవ స్థానంలో నిలిచింది.

ది వారియర్ : రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ 9.38 మిలియన్ వ్యూస్ తో ఏడవ స్థానంలో నిలిచింది.

రాబిన్ హుడ్ : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ 9.19 మిలియన్ వ్యూస్ తో 8 వ స్థానంలో నిలిచింది.

ఆమెగోస్ : కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ 8.49 మిలియన్ వ్యూస్ తో 9 వ స్థానంలో నిలిచింది.

కస్టడీ : నాగ చైతన్య హీరో గా రూపొందిన ఈ సినిమా టీజర్ 8.33 మిలియన్ వ్యూస్ తో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: