
అయితే రెజీనాతో సందీప్ కిషన్ మధ్య ఏమీ లేకుండానే రెజినా ఐదు లక్షలు అప్పు ఇచ్చిందా అని చాలామంది అనుకుంటారు.అలాగే మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కూడా కొంతమంది రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం చాలా కొట్టుకుంటాం.మేము కొట్టుకున్నంతలా ఎవరు కొట్టుకోరు. కానీ మేము కలిసేది చాలా తక్కువ.అలాగే ఫోన్లు కూడా ఎక్కువగా మాట్లాడుకోం.ఒకవేళ ఫోన్ మాట్లాడుకున్నా కూడా నేను పాప అంటే రెజినా నన్ను తాతా అని పిలుస్తుంది.రెజీనా మా ఇంట్లో మనిషిలాగే ఉంటుంది. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ఓ సందర్భంలో నా దగ్గర 11000 మాత్రమే ఉన్నాయి.నేను చాలా అవసరాల్లో ఉన్నాను. ఆ విషయం తెలుసుకున్న రెజినా 5 లక్షలు ఇచ్చింది. వద్దని చెప్పినా వినలేదు. అంటూ సందీప్ కిషన్ రెజినాతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి బయటపెట్టారు..
అయితే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో బెస్ట్ ఫ్రెండ్ బెటర్ ఆఫ్ ఎందుకు కాకూడదు అని యాంకర్ ప్రశ్నించగా..నాకు రెజీనా పై అలాంటి ఉద్దేశం అస్సలు లేదు.మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని క్లారిటీ ఇచ్చారు. కానీ సందీప్ కిషన్ మాటలు విన్న నెటిజన్స్ మాత్రం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు పెళ్లికి ముందు ఇలా ఫ్రెండ్స్ అని చెప్పి వెర్రివాళ్ళని చేశారు. ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు రెజీనా మా ఇంట్లో మనిషి అని చెప్పి సందీప్ కిషన్ తమ లవ్ కన్ఫర్మ్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు .