నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం నాని సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ సినిమాలో కూడా నాని హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న నాని మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... నాని తమిళ దర్శకుడు అయినటువంటి సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి అని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా సిబి చక్రవర్తి , నాని కి ఓ కథను వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో నాని , సిబి చక్రవర్తి దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా నాని మరో క్రేజీ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అసలు విషయంలోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల నానితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాని కి శేఖర్ కమ్ముల ఓ కథను వినిపించగా , ఆ కథ నచ్చడంతో శేఖర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: