బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం పఠాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2023 వ సంవత్సరం జనవరి 25 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. పటాన్ మూవీ కంటే ముందు షారుక్ ఖాన్ కి బారసా పెట్టి అపజయాలు రావడంతో ఈయన కొంత కాలం పాటు సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. అలా చాలా కాలం గ్యాప్ తర్వాత ఈయన నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇకపోతే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వల్ గా పటాన్ 2 ను రూపొందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పటాన్ 2 కు సంబంధించిన కథ పనులు కూడా పూర్తి అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు దర్శకుడిని ఫైనల్ చేసి అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. పటాన్ 2 కి సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు వార్తలు వస్తుండడంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: