
ఇక పుష్ప2లో దెబ్బలు పడతాయి రాజా అనే సాంగ్ తో ఓ రేంజ్ లో అల్లాడించేసింది . అయితే ఈ మధ్యకాలంలో తెలుగు డైరెక్టర్ లు ఆమె వద్దకు వెళుతున్న కూడా ఆమె ఆఫర్స్ రిజెక్ట్ చేస్తూ వస్తుంది అన్న వార్తలు ఎక్కువగా విన్నం. ఫైనల్లీ ఒక తెలుగు సినిమాని అయితే ఓకే చేసింది అన్న టాక్ బయటకు వచ్చింది . ఆ సినిమా మరేంటో కాదు..సుకుమార్-చరణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమానే. ఎస్ డైరెక్టర్ సుకుమార్ - చరణ్ సినిమా విషయంలో చాలా చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నాడు.
రిపీటెడ్ హీరోయిన్స్ రిపీట్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ని పర్టిక్యూలర్గా చూస్ చేసుకుంటున్నారట సుకుమార్ . కాగా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం శ్రీలీలను చూస్ చేసుకున్నారట. ఆఫ్ కోర్స్ ఇది చాలా చిన్న రోల్ అయినప్పటికీ శ్రీలీల యాక్సెప్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ సినిమాలో నటించే అవకాశం వస్తేనే అది ఒక మహా ప్రసాదంగా భావిస్తారు . మరి శ్రీ లీల ఈ సినిమా కి "కీ" నటించే ఆఫర్ వస్తే మిస్ చేసుకుంటుందా నో వే .. అలాంటి పని ఎప్పటికీ చేయదు. అందుకే ఆల్రెడీ పుష్ప2 సినిమాతో మంచి ర్యాపో పెంచుకున్న సుకుమార్ తో మరొకసారి ఆమె వర్క్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!