
మరి రచయిత దర్శకుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. నాకు ఈ డిఫరెన్స్ ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. వారంతా రణ్ బీర్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని నాకు అర్థమైందని ఆయన తెలిపారు. నేను ఇండస్ట్రీకి కొత్త కాబట్టి నన్ను విమర్శించడం చాలా సులువు అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఒక నిర్మాత సినిమా తీయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు.
ఆ సమయంలో హీరో ఏకంగా 5 సినిమాలైనా చేయగలడని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. యానిమల్ మూవీని విమర్శించిన వాళ్లంతా రణబీర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అతడిని ఏమీ అనలేదని ఇది నిజమని ఆయన తెలిపారు. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా స్పిరిట్ టైటిల్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ పారితోషికం ఒకింత భారీస్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.