విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించాడు. ఇకపోతే వెంకటేష్ హీరో గా రూపొందిన ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ "సూర్యవంశం" అనే ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వెంకటేష్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రి పాత్రలో మరొక పాత్రలో కొడుకు పాత్రలో నటించి రెండు పాత్రల్లో కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.

మూవీ లో తండ్రి పాత్ర లో నటించిన వెంకటేష్ కు జోడి రాధిక నటించగా ... కొడుకు పాత్ర లో నటించిన వెంకటేష్ కు జోడిగా మీనా నటించింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ 1998 వ సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 27 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

సూర్యవంశం సినిమా 1998 వ సంవత్సరం విడుదల అయ్యి 11.75 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లోని వెంకటేష్ నటనకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ని తలకెక్కించిన విధానానికి గాను ఈ సినిమా దర్శకుడు అయినటువంటి భీమినేని శ్రీనివాసరావు కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: