ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈ మార్చ్ నెలలో కూడా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అందులో మూడు స్టేట్ తెలుగు సినిమాలు ఉంటే , ఒక డబ్బింగ్ సినిమా కూడా ఉంది. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన అవి రీ రిలీజ్ కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన ఈ సినిమాను మార్చి 7 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.

యుగానికి ఒక్కడు : కార్తీ హీరో గా రూపొందిన ఈ తమిళ డబ్బింగ్ సినిమాను మార్చి 14 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మార్చి 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.

ఎవడే సుబ్రహ్మణ్యం : నాని హీరో గా రూపొందిన ఈ సినిమాను మార్చి 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.

ఇలా ఈ మార్చి నెలలో ఈ నాలుగు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. అందులో ఏ సినిమా ఎలాంటి కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా రాబడుతుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: