
సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానుండటం గమనార్హం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలో కనిపించి మెప్పించారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.
రీరిలీజ్ లో ఆదిత్య369 మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 38 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ఇతర భాషల్లో సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల ప్రేక్షకులను సైతం అంచనాలను మించి మెప్పిస్తుందనే సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ మూవీ మలయాళ, హిందీ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది. డాకు మహారాజ్ మూవీ కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ను మెప్పించింది. బాలయ్య సినిమాల రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఓకే చెబుతున్న బాలయ్య ఆ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుండటం గమనార్హం. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య మల్టీస్టారర్లకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు.