రష్మిక మందన్నా.. ఓ బిగ్ బడా పాన్ ఇండియా హీరోయిన్ . రీసెంట్ గా రష్మిక మందన్నా పేరు ఎలా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతూ వస్తుందో మనం చూస్తూనే వస్తున్నాం.  ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అది కూడా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే హిట్లు . ఇలా హిట్లు కొడితే  ఏ హీరోయిన్ అయినా పట్టగలమా..? నో వే ఎంత పెద్ద హీరోయిన్ కి అయినా సరే కొంచెం హెడ్ వెయిట్ పెరుగుతుంది . కానీ రష్మిక మందన్నాకు అసలు అలాంటి ది లేదు అంటున్నారు జనాలు .


ఆమె ఏ సినిమాకి కమిట్ అయితే ఆ సినిమా హిట్ అవ్వాలి అంటూ కోరుకొని ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించేస్తుంది అని..అందుకే రష్మిక మందన్నా పాన్ ఇండియా లెవెల్ లో జనాలు ఆదరిస్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్స్ కూడా ఆమెను సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు రష్మిక అభిమానులు.  అయితే మొదటి నుండి రష్మిక మందన్నా పై ఓ విషయంలో  నెగిటివ్ గా  జనాలు ఎప్పుడు మాట్లాడుకుంటారు.



ఆమె కి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం  పెద్దగా రాదు అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.  ఆమె కెరియర్ స్టార్ట్ చేసిన ఛలో సినిమా ద్వారా నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ఛావా సినిమా వరకు ప్రతి ఒక్కరిది అదే నెగిటివ్ పాయింట్ . అయితే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు అందుకున్న రష్మిక మందన్నా హ్యూజ్ సక్సెస్ అందుకున్న సరే జనాలు .. ఆ విషయం మర్చిపోకుండా పట్టుకుని ట్రోల్ చేస్తూ ఉండడం రష్మిక మందన్నా ఫ్యాన్స్ కి హర్టింగ్ గా అనిపిస్తుంది . అంతే కాదు ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది  రష్మిక మందనానే..!

మరింత సమాచారం తెలుసుకోండి: