
సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలు ఉన్నప్పటికీ ప్రజల హృదయాలలో కొన్ని మెమొరబుల్ సినిమాలు ఉంటాయి అలాంటి వాటిలో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి. తాజగా ఈ సినిమా రి రిలీజ్ చేయబోతున్న సందర్భంగా నిర్మాత శివలంకే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆదిత్య 369 సినిమా మొదటిసారి రిలీజ్ అయిన సమయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇప్పుడు రే రిలీజ్ లో కూడా అలాగే ఉన్నానని తెలియజేశారు.. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుందని తెలియజేశారు.
4K లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్ని వయసుల వర్గాల ప్రేక్షకులను అలరించడానికి మీ ముందుకు రాబోతున్నాము అంటూ తెలియజేశారు. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన తనకు తమ నిర్మాణ సంస్థ ఒక గొప్ప పేరు ఉన్నదని ఈ సమ్మర్లో గ్రాండ్గా ఈ సినిమాను రి రిలీజ్ చేయవడానికి సన్నహాలు చేస్తున్నామన్నట్లుగా తెలియజేశారు. మొత్తానికి బాలయ్య అభిమానులకు సైతం ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా రీ రిలీజ్ అని తెలిసి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.