ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి . మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే వస్తుంది . ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.  ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఫైనల్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రాబోతుంది అంటూ అఫీషియల్ అప్డేట్ వచ్చింది . దీనితో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు.


ఇన్నాళ్ళకి బాలయ్య కొడుకు సినిమా ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఆనందపడ్డారు . ఆ ఆనందం కొన్ని రోజులు కూడా లేకుండానే పోయింది . సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు నందమూరి ఫ్యామిలీ ..ఇటు ప్రశాంత్ వర్మ రియాక్ట్ కాకపోవడంతో ఇది నిజమే అంటూ తేల్చేసుకున్నారు అభిమానులు . అంతేకాదు ఆ తర్వాత నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అయింది . అయితే అదికాస్త ఫేక్ అని నాగ్ అశ్వీన్ ఇప్పుడు అప్పట్లో ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు అంటూ తెలిపోయింది.



అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..?  ఉండదా..? ఉంటే ఏ డైరెక్టర్ దర్శకత్వంలో అనేది క్లారిటీకి రావాలి . కానీ బాలయ్య అవి ఏవి పట్టించుకోవడం లేదు . బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలో హీరో గా సెటిల్ అవ్వడం  కన్నా రాజకీయాల్లోకి  రావడమే ది బెటర్ ఆప్షన్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అదేవిధంగా బాలయ్య సెకండ్ ఆప్షన్ కింద కూడా మోక్షజ్ఞ  ని పాలిటిక్స్ లోకి పంపించే ఆలోచనలో ఉన్నారట . ఒకపక్క చంద్రబాబునాయుడు మరొక పక్క లోకేష్ .. ఇంకో పక్క భరత్.. ఇలా అందరూ అడుగడుగున సపోర్ట్ చేస్తాడు మోక్షజ్ఞ కి అంటూ పొలిటికల్ పరంగా కూడా మోక్షజ్ఞ కి లైఫ్ ఉండాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే బాలయ్య దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . మోక్షజ్ఞ కి కూడా పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం ఫ్రెండ్స్ ద్వార బయటకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: