ఫైనల్లీ.. సమంత అభిమానులకి మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది . ఇన్నాళ్లు సమంత తెలుగు సినిమాలల్లో ఎప్పుడు నటిస్తుందా..? అంటూ చాలామంది జనాలు వెయిట్ చేశారు. అయితే సమంత తెలుగులో లాస్ట్ నటించిన సినిమా "ఖుషి" అని చెప్పాలి . విడాకుల తర్వాత ఆమె తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు . ఒకటి "శాకుంతలం" రెండు "ఖుషి". పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.  అయితే అది కౌంట్ చేసుకోవడానికి లేనేలేదు . ఖుషి సినిమా మంచి హిట్ అందుకుంది .


అయితే ఎందుకో తెలియదు సమంత తర్వాత తెలుగులో సినిమాలను సైన్ చేయలేదు. చాలా సందర్భాలలో స్టార్స్ సమంత తెలుగు సినిమాలను చేయాలి అంటూ కోరుకుంటున్నారు అభిమానులు అన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఓ ఈవెంట్ లో ఓపెన్ గానే "మీరు సినిమాల్లో మళ్ళీ నటించాలి అని కోరుకుంటున్నాము అని ..తెలుగు జనాలకి మీ అవసరం చాలా ఉంది" అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.  అప్పటినుంచి చాలామంది సమంత ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు సమంత తెలుగు సినిమాలను ఓకే చేస్తుందా..? అంటూ ఎదురుచూశారు .



రీసెంట్గా ఓ అభిమాని డైరెక్ట్ గానే తెలుగు సినిమాలు చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు . దానికి సమంత కూడా త్వరలోనే వస్తున్నాను బ్రో..అంటూ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు సమంతడైరెక్టర్ దర్శకత్వంలో రాబోతుంది. అసలు హీరో ఎవరు..? అనే విషయాలు బాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు త్వరలోనే "రామ్ పోతినేని" తో సినిమా చేయబోతున్నాడు అని ..ఆ సినిమాలో కీలక పాత్ర కోసం సమంత సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఆల్రెడీ సమంత - త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కంటెంట్ ఉంటే ఎలాంటి పాత్రలు అయినా సమంత నటిస్తుంది . ఆ విషయం అందరికీ తెలిసిందే . త్రివిక్రమ్ ఫైనల్లీ అనుకున్నది సాధించాడు అంటూ ఓ రేంజ్ లో సమంత తెలుగు మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: