టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్గా సీనియర్ రమ్యకృష్ణ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నది. రమ్యకృష్ణ భర్త సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఉండలేదని తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అటు రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చిన తాజాగా కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



రమ్యకృష్ణ తన కొడుకుతో ప్రస్తుతం చెన్నైలో ఉంటోందని దీంతో తన భర్తకు దూరంగా కొడుకుని పెంచుతోందినీ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనిడానికి ఇదే కారణం అన్నట్లుగా వైరల్ గా చేస్తున్నారు. ఈ విషయం పైన కృష్ణవంశీ మాట్లాడుతూ మా 22 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలలో అసలు నిజమే కాదని తామద్దరము విడాకులు తీసుకున్నట్లు పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణ తన సినిమాలను, లైఫ్ ని చాలా బ్యాలెన్స్ గా ముందుకు తీసుకు వెళుతుందని తెలిపారు. అందుకే ఆమెకు సాటి రాలేమని తెలిపారు.


అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లకు కలిసే వెళుతూ ఉంటాము కానీ ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకోవడం మాత్రం తమకు ఇష్టం ఉండదని అది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని తెలియజేశారు. తాను సినిమాల కోసం హైదరాబాదులో ఉంటున్నానని.. రమ్యకృష్ణ చెన్నైలో ఉన్నప్పటికీ మేమిద్దరం కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామని తెలియజేశారు కృష్ణవంశీ. మొత్తానికి విడాకుల రూమర్స్ పైన ఎట్టకేలకు తెగేసి చెప్పడంతో ఇక మీదటైనా ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి మరి. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ ఎన్నో విభిన్నమైన పాత్రలో నటిస్తూ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: