
తమిళనాడులో జన్మించిన త్రిష .. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి .. 1999లో నటుడు ప్రశాంత్ నటించిన జోడి సినిమాల్లో చిన్న పాత్రలో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టింది .. ఇందులో హీరోయిన్ సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించింది. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు త్రిషకు హీరోయున్గా అవకాశం వచ్చింది ..2002 లో మౌనం పెసియాతే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి .. ఆ తర్వాత తెలుగు , తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది.
ఇలా తన 25 ఏళ్ల సినీ జీవితంలో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ స్టార్ డంను అందుకుంది .. అయితే కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి తన జోరు చూపిస్తుంది .. ఈ సంవత్సరం ఆమె చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే త్రిష 1999 సెప్టెంబర్ 30న జరిగిన మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది .. అయితే అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాల మాత్రమే .. అతి చిన్న వయసులోనే మిస్ చెన్నైగా నిలిచి ఆరుదైన రికార్డును త్రిష తన ఖాతాలో వేసుకుంది .