
ఇక ఈ సినిమాకు హీరోల అభిమానులతో సంబంధం లేకుండా ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు .. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు కదలకుండా చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు . అయితే ఇప్పుడు త్వరలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. సినిమాను మార్చి 7న మరోసారి రిలీజ్ చేయబోతున్నారు .. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు , వెంకటేష్ లను పెద్దోడు , చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు .. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కు మల్లికార్జున, మహేష్ కు సీతారామరాజు అనే పేర్లు పెట్టుకుని కథ రాసుకున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ..
అయితే సినిమాలో అంజలి పాత్ర పేరు సితా కాబట్టి మహేష్ బాబు పేరు విషయంలో గంధర్ గోళం ఉంటుందని ఆయన అనుకున్నారు .. మరోసారి వీరికి రాముడు , లక్ష్మణుడు అనే పేర్లు కూడా పెట్టాలని భావించారట .. కానీ ఎలాంటి లాభం లేదు అని చిన్నోడు , పెద్దోడు అని ఫిక్స్ చేశారట .. మహేష్ ప్రస్తుతం రాజమౌళితో ఓ భారీ సినిమా చేస్తున్నారు .. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది . అలాగే వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలు వేసుకున్నాడు.