
ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటించిన అన్నీ మూవీస్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. మాస్ కా దాస్ పాత్రలలో తెరపై కనిపించే విశ్వక్.. ఇప్పుడు ఈ సినిమాలో లేడి కేటాప్ లో అదరగొట్టారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందులో కావాలనే 11 నెంబర్ ని తీసుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అది మరింత వివాదంగా మరి చివరకు వైసీపీ అభిమానులు లైలా మూవీని బాయ్ కాట్ చేస్తామనేదాకా వచ్చింది. విడుదల అవ్వకముందే ఈ సినిమాపై నెగిటివిటీ పడిపోయింది. కొన్ని గంటల్లోనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేశారు. దీంతో వెంటనే హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి.. ఆ మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. పృథ్వీ మాట్లాడిన మాటలకు తాను క్షమాపణలు తెలుపుతూ.. తన సినిమాను రాజకీయ గోడవలకు బలి చేయవద్దని తెలిపాడు. ఆయనతో పాటు సినిమా నిర్మాత సాహు గారపాటి కూడా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి వచ్చి సందడి చేయనుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కూడా డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 7న అమెజాన్ ప్రైమ్ లో లైలా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.