ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓయ్, 7G బృందావన కాలనీ, ఆరెంజ్, గబ్బర్ సింగ్, మురారి, ఇంద్ర, భద్రి, త్రీ, లీడర్, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి. సినిమాలతో సమానంగా రీరిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
ఇక ఈ రీరిలీజ్ మూవీస్ తో మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఈ సారి రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాలతో పాటు రీరిలీజ్ కి ఓల్డ్ మూవీస్ కూడా రెఢీ అయ్యాయి. అయితే రిలీజ్ అయ్యి సందడి చేసే రీరిలీజ్ మూవీస్ లో ఒక  బాలీవుడ్ సినిమా మాత్రం రీరిలీజ్ లో కూడా కోట్లు సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా పేరెంటి.. ఎన్ని కోట్లు సంపాదించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

హీరో హర్షవర్ధన్ రాణే నటించిన సనమ్ తేరి కసమ్ మూవీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా అంటే చూడనివారుండారు. ఈ సినిమా ప్రేమకి ఒక ప్రతిరూపంలాగా ఉంటుంది. ఈ సినిమా ఇటీవల మరోసారి థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రీరిలీజ్ తర్వాత ఇండియన్ హిస్టరీలో రూ.  50 కోట్ల కలెక్షన్ ని దాటిన మొదటి సినిమాగా నిలిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: