
రెండిటా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్',' ఆదిపురుష్' చిత్రాలు రిలీజ్ అయి ప్లాప్ అయ్యాయి. లేకపోతే వీటికి కంటున్యూటీ కథలు తెరపైకి వచ్చేవేమో. ఆ తర్వాత 'సలార్', 'కల్కి' కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఇప్పటికే వీటి మొదటి భాగాలు భారీ విజయం సాధించడంతో? రెండవ భాగం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి భారీ స్పాన్ ఉన్న కథలు కావడంతో? రెండు భాగాలుగా చెప్ప డంలో అర్దం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న 'పౌజీ' కూడా రెండు భాగాలు రిలీజ్ అవుతుందనే ప్రచారంలో ఉంది.ఈ కథని ఒక్క భాగంలో చెప్పడానికి వీలున్నా అధిక బడ్జెట్ కారణంగా రెండు ముక్కలుగా చీల్చుతున్నట్లు సమాచారం. వ్యవ హారం చూస్తుంటే ప్రభాస్ తో ఏ ఒక్కరూ రెండున్నర గంటల సినిమా తీసేలా కనిపించలేదు. పాన్ ఇండియాలో డార్లింగ్ ఛరిష్మాతో కోట్ల వసూళ్లు రాబట్టొచ్చు అన్న స్ట్రాటజీతోనే మేకర్స్ ముందుకెళ్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తదుపరి సలార్ 2, కల్కి -2 చిత్రాలతో బిజీ కానున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో చేసే స్పిరిట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లనుందని తెలుస్తోంది.