టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారుండారు. ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల యానిమల్ సినిమాతో కూడా సందీప్ రెడ్డి వంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లోనూ మస్తు క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను యానిమల్ సినిమా తీశాక.. తనపై ఇండస్ట్రీ జనాలే ఘోరంగా విమర్శలు చేశారని అన్నారు. అందరూ తనని బ్యాడ్ గా అన్నప్పటికి కూడా రణబీర్ కపూర్ నటనను మాత్రం మెచ్చుకున్నారని తెలిపారు. తాను రణబీర్ మీద జెలసీ ఫీల్ అవ్వడం లేదని.. కానీ రణబీర్ చాలా తెలివైన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వారందరూ రణబీర్ తో కలిసి పని చేయాలని అనుకున్నారని అన్నారు. తాను మాత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త కాబట్టి విమర్శలు రావడం మామూలే అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
అలాగే తాను తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చాడు కాబట్టి.. బాలీవుడ్ లో బయట వాడిలా ట్రీట్ చేస్తున్నారా? అని సందీప్ రెడ్డి వంగా ఓసారి ప్రశ్నించారని తెలిపారు. కానీ అలా ఏం లేదని, అవుట్ సైడర్, ఇన్ సైడర్ అనేది ఏం ఉండదని చెప్పారని అన్నారు. అలాంటివి తాను నమ్మరాని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో ఎవరైనా ఎప్పుడైనా సినిమా తీయచ్చు కానీ అక్కడ గ్యాంగ్, అసమానతలు ఉంటాయని వంగా స్పష్టం చేశారు. బాలీవుడ్ లో అనే కాదు.. ఎక్కడికి వెళ్లిన అలానే ఉంటుందని సందీప్ రెడ్డి వంగా అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: