నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రదీప్ "లవ్ టుడే" అనే సినిమాలో హీరో గా నటించి ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రదీప్ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు డ్రాగన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకు తమిళ్ , తెలుగు రెండు భాషల్లో కూడా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సనా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా బుచ్చిబాబు ఈ సినిమా గురించి స్పందిస్తూ ... నిన్న రాత్రి నేను ఈ సినిమా చూశాను. నాకు ఈ సినిమా నిజంగా బాగా నచ్చింది. ఈ సినిమాగొప్ప హాస్యం , భావోద్వేగాల మిశ్రమంతో మంచి సందేశాన్ని కలిగి ఉంది.

ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ నటన చాలా బాగుంది. నేటి తరం జీవితాలను ఈ మూవీ లో చాలా అందంగా చిత్రీకరించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమా కోసం చాలా మంచి స్క్రీన్ ప్లే రాశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగుందని ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం బుచ్చిబాబు , రామ్ చరణ్ హీరోగా ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: