
ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేయలేదని చాలామంది ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తెలుగు ఆడియోస్ కి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉట్కేకర్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్స్ ని దాటేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విక్కీ కౌశల్ ఊరి సినిమా పేరిట ఉన్న రికార్డులను కూడా తిరగరాసేలా కనిపిస్తూ ఉన్నారు.
ఈ మంత్ ఎండింగ్ కల్లా పెద్ద సినిమాలు ఏవి కూడా విడుదల కాకపోతే సరికొత్త రికార్డులను కూడా తిరగరాసేలా ఉన్నది ఛావా. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు పలు రకాల ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయట. గీత ఆర్ట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 7వ తేదీన చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజున తెలుగు వర్షన్ కి సంబంధించి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి ఒకవేళ తీసుకు వస్తే ఒక మంచి సినిమాని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసినట్టుగా ఉంటుంది.