టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులలో శైలేష్ కోలను ఒకరు. ఈయన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈ దర్శకుడికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత శైలేష్ తెలుగులో మంచి విజయం సాధించిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ని హిందీ లో అదే టైటిల్ తో రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఆ తర్వాత ఈయన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని తెలుగు లో రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ సినిమా ప్లాప్ తర్వాత శైలేష్ , నాని హీరోగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

మూవీ టీజర్ ద్వారా ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది. శైలేష్ హిట్ 1 , హిట్ 2 మూవీలలో పెద్దగా వైలెన్స్ లేకుండా స్క్రీన్ ప్లే తో సినిమాలను ముందుకు సాగించాడు. కానీ హిట్ 3 లో మాత్రం సైంధవ్ మూవీ లో మాదిరి భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సైంధవ్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ దర్శకుడు హిట్ 3 మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: