టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరో గా నటించాడు. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయాలను అందుకున్న ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా డిఫరెంట్ జోనర్ సినిమాలలో నటిస్తూ రావడంతో నటుడిగా ఈయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ "మజాకా" అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా ... రావు రమేష్ , అన్షు ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా ఫిబ్రవరి 26 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న అనగా ఫిబ్రవరి 25 వ తేదీనే కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఇప్పటికే వచ్చి చాలా సమయమే అవుతుంది. ఈ మూవీ కి పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ మొదటి రోజు భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం కాస్త కష్టంగానే కనబడుతుంది.

ఎందుకు అంటే ఈ మూవీ కి బుక్ మై షో లో పెద్దగా సేల్స్ జరగడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన టికెట్ సేల్స్ గంటకి కేవలం 1 కే ప్లస్ గానే జరుగుతున్నాయి. ఈ మూవీ టికెట్స్ ప్రస్తుతం బుక్ మై షో లో సేల్ అవుతున్న పద్ధతిని బట్టి చూస్తే ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశాలు కనబడడం లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk