స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి పరిచయం అనవసరం. ఇటీవల ఆయన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేశారు. లక్కీ భాస్కర్ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా హీరోయిన్ మీనాక్షీ చౌదరి నటించింది. ఈ సినిమా ఒక్క మధ్య తరగతి కుటుంబానికి ఉన్న అప్పులు, అవమానాలు గురించి చాలా బాగా చూపించింది. ఓ మధ్య తరగతి వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం పడే కష్టం కనిపిస్తుంది.
ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి విమర్శకుల నుండి కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుని ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా రిలీజ్ అయ్యింది. ఇక రూ. 100 కోట్లు దాటిన తొలి సినిమాగా దుల్కర్ సల్మాన్ కెరీర్ లో లక్కీ భాస్కర్ సినిమా నిలిచింది.

అయితే ఈ సినిమా థియేటర్ లతో పాటుగా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా గత 13 వారాల నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతొంది. వరుసగా 13 వారాలు ట్రెండ్ అయిన తొలి తెలుగు సినిమాగా లక్కీ భాస్కర్ మూవీ రికార్డ్ బద్దలు కొట్టింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటన మాత్రం చాలా సహజంగా ఉంది. మీనాక్షీ చౌదరి కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా అందరి దగ్గర నుండి మంచి మెప్పులు పొందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: