
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కు వెన్నంటే ఉన్న బన్నీ వాసు ఇప్పుడు తాజాగా పార్టీలో కీలకమైన బాధ్యతలు వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బన్నీ వాసుకి కూడా జనసేన పార్టీలో మరింత ప్రాధాన్యత లభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. వచ్చే నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా బన్నీ వాసు కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇంచార్జిగా బన్నీ వాసుని నియమించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించి అన్ని విషయాలకు బన్నీ వాసు నేతృత్వంలోనే జరగబోతున్నాయట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ చేయబోతున్నారు. జనసేన నేతలు చూపు అంతా కూడా ఈ రాజకీయ వేదికపైనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇలాంటి కీలక బాధ్యతలను బన్నీకి అప్పజెప్పిన పవన్ కళ్యాణ్ మరి ఎంత మేరకు సక్సెస్ చేసి అభిమానులను, నేతలను ఖుషి చేస్తారో చూడాలి మరి. మొత్తానికి ఇటు మెగా క్యాంపు వైపుగా బన్నీ వాసు అడుగులు వేస్తున్నారు.