
మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన "దేవర" సినిమా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు . కానీ ఆ సినిమా హిట్ కాలేదు . అంతేకాదు రామ్ చరణ్ తో ఆమె ఒక సినిమాకి కమిట్ అయింది . ఈ సినిమాతో ఆమె కెరియర్ మారిపోతుంది అని అనుకుంటున్నారు శ్రీదేవి అభిమానులు. అయితే జాన్వి కపూర్ కి సినిమా అవకాశాలు ఏమి ఊరికే రావడం లేదు . తల్లి ఒక్కప్పటి ఫ్యాన్ ఫాలోయింగ్ తండ్రి ప్రజెంట్ స్టేటస్ చూసి అవకాశాలు దక్కించుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తుంది.
అయితే జాన్వికపూర్ కి మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్న కొన్ని కారణాల చేత ఆమె కెరియర్ త్వరగా సెటిల్ అవ్వలేకపోవచ్చు అంటూ బోనీ కపూర్ మంచి మంచి సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారట. అంతేకాదు పెద్ద సినిమాలల్లో ఆఫర్ అయితేనే ఓకే చేస్తున్నారట. ఇది టూ వరస్ట్ ఆలోచన. హీరోయిన్ గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఏ క్యారెక్టర్ లో నైనా నటించాలి. అయితే బోనీ కపూర్ మాత్రం సినిమాల్లో ఫస్ట్ హీరోయిన్ అయి ఉంటేనే జాన్వి కపూర్ ని ఆ సినిమాలో హీరోయిన్గా చూస్ చేస్తున్నాడట. అన్ని చక్కగా ఉన్న జాన్వి కపూర్ కి తండ్రే శాపంగా మారాడు అంటున్నారు జనాలు. చూడాలి మరి బోనికపూర్ నిర్ణయాలు జాన్వి కపూర్ కి ఏ మాత్రం కలిసి వస్తాయో..??