గత కొంతకాలంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా వైడ్ తమ క్రేజ్ పెంచుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు..తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమ సినిమాలతో ఇతర రాష్ట్ర ప్రజలను సైతం మన హీరోలు ఆకట్టుకుంటున్నారు.కొందరు స్టార్ హీరోలు అయితే విదేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.. యుఎస్‌లో తెలుగు హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంది..అయితే తెలుగు సినిమాలకు భారీగా మార్కెట్ ఓపెన్ అయిన మరొక దేశం జపాన్. ఇక్కడ 'బాహుబలి' సినిమా రికార్డు క్రియేట్ చేసింది... దీని తర్వాత వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా భారీ విజయం సాధించింది..ఇండియన్ సినిమాల రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసింది.ఇవి రెండూ కూడా రాజమౌళి సినిమాలే కావడంతో ప్రేక్షకులు ఎగబడి చూసారు..

కానీ ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాని జపనీస్‌లో అనువదించి బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ అది అక్కడ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.తాజాగా జపాన్‌లో  సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ తన సోలో హీరోగా నటించిన ‘దేవర’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 'దేవర' సినిమా జపనీస్‌లో మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా ఎన్టీఆర్ జపాన్ మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. త్వరలోనే ఎన్టీఆర్ జపాన్‌కు వెళ్లి “దేవర” సినిమాను ప్రమోట్ చేయనున్నాడని తెలుస్తుంది..

అయితే దేవర సినిమా కు తెలుగులోనే మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది.. మరి జపాన్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు.. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ అయినాక మార్చి చివరిలో ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు..ఈ సినిమాను ప్రశాంత్ నీల్ భారీ స్థాయి లో తెరకెక్కిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: