తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. నాగార్జున సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇటీవలే నాగచైతన్య పెళ్లి అయిన విషయాన్ని తెలియజేయడమే కాకుండా అఖిల్ కి కూడా ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక ఎమోషనల్ ట్విట్ చేయడం జరిగింది.


అక్కినేని కుటుంబానికి వీర అభిమాని అయినటువంటి అయ్యప్ప రెడ్డి మృతి చెందినట్లుగా వెల్లడించడం జరిగింది. నాగార్జున ఈ మేరకు ట్విట్టర్లో ఒక ఎమోషనల్ కొటేషన్ ని రాసుకొచ్చారు.. తీవ్ర విషాదం చోటు చేసుకున్నది సడన్గా ముద్దుల అయ్యప్ప రెడ్డి గారు మరణించినందుకు చాలా బాధపడుతున్నానని వెల్లడించారు.. ఎందుకంటే అతడు మా నాన్న ఏఎన్నార్ గారికి చాలా వీర అభిమాని అంటూ అలాగే అక్కినేని కుటుంబానికి మూలస్తంభం వంటి వారు మా పట్ల చూపిన ఈ ప్రేమ ఆప్యాయత ఎనలేనిది అంటూ తెలిపారు. అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ తెలియజేశారు నాగార్జున.


నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా తన చిత్రాలను రిలీజ్ చేస్తే గట్టి పోటీ చేస్తున్నారు. చివరిగా గత ఏడాది నా సామి రంగ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగార్జున.. ప్రస్తుతమైతే రజనీకాంత్ కూలి సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ తో కలిసి కుబేర అనే సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు నాగార్జున. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లోనే త్వరలోనే  రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే హీరోగా తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరి రాబోయే రోజుల్లో ప్రకటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: