కొన్ని సంవత్సరాల క్రితం ఒక భాషలో ఏదైనా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది అంటే చాలు ఆ మూవీ ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి మేకర్స్ అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాల విజయ శాతం చాలా వరకు తగ్గిపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే రీమిక్ సినిమాఉ విజయాలను అందుకున్న దాఖలాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దానితో మేకర్స్ రీమిక్ సినిమాల వైపు ఆసక్తిని చూపించడం చాలా వరకు తగ్గించారు.

ఇక ఇలాంటి సమయం లో కూడా ఓ తెలుగు మూవీ ని హిందీ లో రీమిక్ చేయడానికి ఓ టాలీవుడ్ క్రేజీ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం ఆనంద్ దేవరకొండ , వీరాజ్ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో బేబీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకుని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని హిందీ లో రీమిక్ చేయబోతున్నారు అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ మూవీ హిందీ రీమేక్ కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని హిందీ లో మైత్రి సంస్థ వారు రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి అయినట్లు మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు రీమేక్ చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: