హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ తెలుగు మూవీ లు ఏవో తెలుసుకుందాం.

గీత గోవిందం : విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

సరిపోదా శనివారం : నాని హీరో గా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 100.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతుంది.

ఈగ : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: