
అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ ఉంటుంది . ఆమె ఇంత పెద్ద హీరోయిన్.. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారా..? అని ఎవరు గెస్ చేయలేరు . అయితే సాయి పల్లవి ఒకానొక ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టింది . నేషనల్ అవార్డు అందుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే జనాలు ఆమె గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు . అస్సలు అంత టాలెంట్ ఉన్న ఆమెకి నేషనల్ అవార్డు ఎందుకు రావడం లేదు ..? అనే విషయం చర్చించుకుంటున్నారు .
సాయి పల్లవి తీసుకునే నిర్ణయాలే ఆమెకు రాకుండా చేస్తున్నాయి అంటూ మాట్లాడుతున్నారు . అసలు ఆ సినిమాలో ఆమెకు సంబంధించిన రొమాంటిక్ సీన్ లేకపోయినా వేరే రొమాంటిక్ సీన్ ఉన్నా ఆ సినిమాని అస్సలు చేయదట. ఆ కారణంగానే చాలా చాలా మంచి సినిమాలను మిస్ చేసుకుందట . ఇలా సాయి పల్లవి ఆమె తీసుకునే నిర్ణయాల కారణంగా నేషనల్ అవార్డు మిస్ అయిపోతుంది అంటున్నారు జనాలు. మొత్తానికి సాయి పల్లవి నేషనల్ అవార్డు అందుకోవాలని ఉందనే కోరిక బయటపెట్టింది. ఫ్యూచర్లోనైనా సాయి పల్లవి అవార్డ్ అందుకుంటుందేమో వేచి చూడాలి..!
1