టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించిన అందులో అనేక మూవీలలో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవిమూవీ లో హీరోయిన్గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని అల్లు అరవింద్ , బన్నీ వాసు నిర్మించారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేయగా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే నాగ చైతన్య తన తదుపరి మూడు మూవీలను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు. అది కూడా మూడు డిఫరెంట్ జోనర్లలో రూపొందబోతునట్లు తెలుస్తుంది. నాగ చైతన్య తన తదుపరి మూవీ ని విరూపాక్ష మూవీ దర్శకుడు అయినటువంటి కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా మిస్టరీ తర్వాత ఆర్కా మీడియా బ్యానర్ చైతూ ఓ హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో  నటించబోతునట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో ఒక హిస్టారికల్ ఫిలింలో నాగ చైతన్య నటించబోతునట్లు తెలుస్తుంది. ఇలా నాగ చైతన్య ఇప్పటికే తన తదుపరి మూడు మూవీ లను ఓకే చేసుకున్నట్లు , ఈ మూడు సినిమాలు కూడా మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కేబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మూవీ లోని నటనకు గాను నాగ చైతన్య కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc