టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాలు చేయాల్సిన పనిలేదు.. కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా శాసిస్తున్నారు. ఇటీవలే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో నటించిన ప్రభాస్ కు ఒక సొంత అన్న ఉన్నారని విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకి ముగ్గురు సంతాన మట.. ఇందులో మొదట కూతురు ప్రగతి.. ఆ తర్వాత ప్రబోద్, చివరిగా ప్రభాస్ సంతానం కలదట. అయితే ప్రభాస్ కంటే ప్రబోదే చాలా పొడవుగా ఉంటారట.


హీరోలకు దీటుగా కటౌట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వలేదు ప్రభాస్ అన్న.. అయితే తనకు హీరోగా అవ్వడం ఇష్టం లేదనే విధంగా వార్తలు వినిపించాయి..అయితే తన మిత్రులు స్థాపించిన ఈ క్రియేషన్స్ సంస్థకి ఫైనాన్షియల్ గా ఉంటున్నారట ప్రబోథ్. ప్రభాస్ అన్న మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. గతంలో కూడా ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయి సుమారుగా ఒక ఏడాది పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారట. ఈ విషయం పైన పెద్దగా గుర్తుపట్టకపోయినా చెక్ బౌన్స్ కేసు తర్వాత ప్రభాస్ అన్న పేరు ఎక్కువగా వినిపించింది.


చెక్ బౌన్స్ కేసు వల్ల ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయట ప్రబోద్ వి. అయితే ఆ తర్వాత మళ్లీ తిరిగి వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అంతే స్పీడుగా పైకి లేచారట. ప్రభాస్ కూడా తన సినిమాలకు వచ్చే రెమ్యూనరేషన్లు కొంత భాగం తన అన్నతో కలిసి వ్యాపార రంగంలో కూడా పెట్టుబడి పెడుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తోటలు ఎక్కువగా ఉండడం చేత వాటన్నిటిని కూడా ప్రబోద్ చెసుకుంటూ ఉంటారట. ఇలా ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని సమాచారం. ప్రభాస్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లేవలో సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్న అభిమానులు ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: